Nellore: జనసేనలోకి భారీగా యువత చేరిక

నెల్లూరు నగరంలోని స్థానిక జనసేన పార్టీ జిల్లా కార్యాలయం నందు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మను క్రాంత్ రెడ్డి సమక్షంలో నెల్లూరు నగరం 3,4,22, డివిజన్ ల నుండి భారీగా యువత జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 22వ డివిజన్ కు చెందిన మహిళ సౌమ్య జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసిపి పాలనతో విసుగు చెందిన యువత, జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో లభిస్తున్న మద్దతు చూసి జనం భారీగా జనసేనలోకి చేరుతున్నారని, వైసిపి నాయకులు వ్యక్తిగత విమర్శలకి ప్రాధాన్యతలిస్తున్నారని, అటువంటి వారికి తగిన గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. తదనంతరం నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని, భవిష్యత్తు జనసేన పార్టీదేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలియా నగర ప్రధాన కార్యదర్శి కంధర డివిజన్ ఇంచార్జ్స్ అనుదీప్, శ్రీకాంత్, అలెక్, ఉదయ్, కరీం, రేవంత్ జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.