దేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించిన విప్లవ వీరుడు నేతాజీ

తాడేపల్లిగూడెం: దేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించిన విప్లవ వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి పురస్కరించుకొని నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవభట్ల విజయ్ హాజరయ్యారు. కేశవభట్ల విజయ్ మాట్లాడుతూ అఖండ భారతావని కలలు కన్నా మరో శివాజీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని దేశం కోసం స్వేచ్ఛ స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి త్యాగం చేయడానికి వెనుకాడని స్ఫూర్తివంతమైన నాయకులు సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. స్వాతంత్రం కోసం ఆయనకు వచ్చిన కలెక్టర్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని భారత మాత బానిస సంకెళ్లు తెంచడమే తన జీవిత లక్ష్యంగా పోరాడిన మహోన్నత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఇప్పుడు యువత సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని అన్నారు. గాంధీజీ సిద్ధాంతంతో విభేదించి అహింసా పద్ధతిలో స్వతంత్రం రాజు అని పరిపూర్ణ స్వాతంత్రం ఎవరో ఇచ్చే బిక్ష కాదని వినతి పత్రాలతోని బొజ్జగింపులతోని రాదు అని ఆయుధాలు పట్టుకుని రక్తం చిందిస్తేనే భారత మాతను బానిస సంకెళ్ల నుండి విముక్తి చేయడం జరుగుతుందని, తాను నమ్మిన సిద్ధాంతాలను జీవితం చివరి వరకు కొనసాగించిన అసలు సిసలైన భరతమాత ముద్దుబిడ్డ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తుమరాడ చిన్న జిల్లా ఉపాధ్యక్షులు మారిశెట్టి నరసింహమూర్తి నియోజకవర్గ కార్యదర్శి చొప్ప లక్ష్మణ్ ఇబ్బంది బెనర్జీ సంతక రమణ చేకూరి గంగాధర్ తదితర బీసీ నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు.