అమ్మ చీర తో మెరిసి మురిసిన నిహారిక

32 ఏళ్ల కింద నాగబాబుతో నిశ్చితార్థం అయినపుడు తాను కట్టుకున్న చీరను భద్రంగా దాచి, దానిని ఇప్పుడు నిహారికకు గిఫ్ట్ గా ఇచ్చారు పద్మజ. దాంతో అప్పుడు నాన్నతో పెళ్లి కోసం అమ్మ కట్టుకున్న చీరను ఇప్పుడు తన పెళ్లికి కట్టుకుని మురిసిపోయింది నిహారిక. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

నిహారిక పెళ్లి వేడుకలు రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 9న పెళ్లి. ఇప్పటికే తన పెళ్లి కోసం అదిరిపోయే స్టైలింగ్ చేయించుకుంటుంది నిహారిక. ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఎన్ని డ్రెస్సులు వేసుకున్నా.. ఎన్ని చీరలు కట్టుకున్నా ఇప్పుడు వచ్చిన ఫోటో మాత్రం అదిరిపోయింది. 32 ఏళ్ల నాటి అమ్మ చీర కట్టుకుని మురిసిపోయింది మెగా డాటర్. అమ్మ చీర నేను కట్టుకున్నాను చూడండి అంటూ లవ్ గుర్తులు పోస్ట్ చేసింది నిహారిక. పెళ్లికి ఎన్ని బహుమతులు వచ్చినా కూడా ఇది మోస్ట్ ప్రస్టేజియస్ గిఫ్ట్ అంటుంది నిహారిక. అమ్మ చీర అలా కట్టుకుంటే తనకు మరో లోకంలో ఉన్నట్లు అనిపిస్తుందని చెప్తుంది నిహారిక. 1988లో నాగబాబు, పద్మజ వివాహం జరిగింది. అప్పటి చీర ఇప్పటికీ అలాగే దాచి పెట్టడం అనేది చిన్న విషయం కాదు.