జనసేన పార్టీకి చేరిన నిట్టమామిడి గ్రామం

పాడేరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డా. వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు జనసేనపార్టీ గ్రామపర్యటనలో భాగంగా జనసేన పార్టీ జాయింట్ చెక్రేటరీ కీల్లోరాజన్, జి.మాడుగుల మండల అధ్యక్షుడు మసాడి భీమన్న, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు తాంగుల రమేష్ ఆధ్వర్యంలో నిట్టమామిడి గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ జాయింట్ చెక్రేటరీ కిల్లో రాజన్ మాట్లాడుతూ ప్రస్తుత గిరిజన రాజకీయాలు మోసాలు, దగాలతో కలుషితమయ్యిందని ఎంతో భవిష్యత్ ఉన్న గిరిజన నిరుద్యోగులు వైసీపీ ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలకు బలైపోయారన్నారు అందుకే జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో ఆంధ్రప్రదేశ్ యువత ఏకీభవించి ముందుకు సాగుతుందన్నారు. మండల అధ్యక్షులు భీమన్న మాట్లాడుతూ రాజకీయాలలో యువతకు ప్రధానబగస్వామ్యం చేసిన ఘనత కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే దక్కుతుందని ఇన్నాళ్లు కుటిల రాజకీయాలకు మోసపోయింది చాలని ఇకనైనా మన ప్రాంతం మన యువత మన భవిష్యత్ వంటి అనేక కార్యక్రమాలు నియోజకవర్గ పరిధిలో చాలా గ్రామాలకు రాజకీయచైతన్యం చేస్తూ పర్యటిస్తున్నామన్నారు. ఈ రోజు నిట్టమామీడి గ్రామం మార్పులో భాగంగా జనసేనపార్టీలో చేరడం మాకు సంతోసానిచ్చిందన్నారు. తాంగుల రమేష్ మాట్లాడుతూ యువత అంత ఏకమైతే మార్పు సాధించేందుకు గొప్ప శక్తి దొరికినట్టేనని మనమంతా సంయుక్తంగా మన హక్కులు, చట్టాలు కాపాడుకోవాలంటే మనం సంఘటితం కావాల్సిందేనన్నారు.ఈ సందర్బంగా జనసేనపార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి గ్రామస్తులు, గ్రామ యువత జనసేనపార్టీలో చేరారు వారికి జనసేనపార్టీ జాయింట్ చెక్రేటరీ, కిల్లో రాజన్, అధ్యక్షులు భీమన్న, కార్యనిర్వహన కమిటీ సభ్యులు రమేష్ కండువాలు కప్పి జనసేనపార్టీలో సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత సాగెని సింహాచలం, చైతన్య, సిరాగం ఈశ్వర్రావు, మఠం మత్స్యరాజు, వీరమహిళ సాగెని కుసుమ పాడేరు నియోజకవర్గ ఐటి ఇన్చార్జ్ అశోక్, మజ్జి సత్యనారాయణ పెద్దఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.