వారాహి యాత్రను ఎవరూ ఆపలేరు: బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం: రాజుపాలెం మండలం, రెడ్డిగూడెం గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం బొర్రా అప్పారావు ఆధ్వర్యంలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగినది. అదేవిధంగా ఇంటింటికి పవనన్న బాట కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ జూన్ 14వ తేదీన జరిగే వారాహి కార్యక్రమాన్ని ఎవరూ ఆపలేరని, సత్తెనపల్లి నియోజకవర్గంలో వారాహి విజయవంతం అవ్వాలని నియోజకవర్గంలో ప్రతిరోజు కార్యక్రమం జరిగేలాగా జనసైనికులకు భరోసా ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు గ్రామ కమిటీ వారు మండల కమిటీ వారు జనసైనికులు అభిమానులు పాల్గొనడం జరిగినది.