ఏ ఒక్కరినీ వదలం – ఖచ్చితంగా బోనెక్కిస్తాం

  • ప్రెస్ క్లబ్ లో పోలీసుల (ఎంట్రీ) అరెస్టులపై ఎస్పీకి వినతి.
  • టిడిపి, జనసేన, సిపిఐల ఆగ్రహం.

తిరుపతి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వైకాపా ప్రభుత్వంలో పాలక ఫ్యాన్ పార్టీని ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు చేసే విధానాన్ని మొన్నటి వరకు చూసామని, సాక్షాత్తు నిన్న బాధితులకు దేవాలయం లాంటి ప్రెస్ క్లబ్ సాక్షిగా జనసేన మహిళలను శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసి 307 కేసులను పెట్టి ఈస్ట్ పిఎస్ కు తీసుకెళ్లడం సిగ్గుచేటని జనసేన పార్టీ జిల్లా అధిష్టానం, టిడిపి, సీపీఐలతో కలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఖాకీలు వైకాపాకు సలాం చేస్తూ ఐపిసి సెక్షన్లకు బదులు వైసీపీ సెక్షన్లను పోలీసు అధిష్టానం ఫాలో అవుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టీ కేసులుకు మించి 307, పాలక పార్టీ అన్యాయాలను వ్యతిరేకిస్తే నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా శాశ్వతం కాదని త్వరలో జనసేన – టిడిపి ప్రభుత్వం రానున్నదని ఇది అధికారులంతా గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కక్ష పూరితమైన కడప సంస్కృతిని తీసుకువచ్చారని పోలీస్ అధికారులకు రేపు సోమవారం లీగల్ నోటీసులు పంపనున్నామని, తమపై తప్పుడు కేసులు పెట్టిన వారిని కోర్టు బోనులో నిలబెడతామని, న్యాయపరంగా వారికి శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. ఇటీవల ప్రతిపక్షాలపై పెట్టిన ఎన్నో 307, కేసులు న్యాయస్థానంలో కొట్టివేయబడ్డాయని గుర్తు చేశారు. ఎందుకు పోలీస్ యంత్రాంగం అత్యుత్సాహం చేస్తున్నదో అర్థం కావడం లేదని, వైసీపీ ప్రభుత్వం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో టిడిపి నేతలు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్, జనసేన పార్టీ నేతలు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్, రాజారెడ్డి, రాజేష్, సిపిఐ నేత మురళి, జనసేన – టీడిపి నేతలు తదితరులు పాల్గొని పాలక పార్టీ దురాగతాలను ఎండగట్టారు.