ప్లాస్టిక్ సంచులు వద్దు – గుడ్డ సంచులు ముద్దు: దల్లి గోవిందరెడ్డి

గాజువాక నియోజకవర్గం 64వార్డ్ యారాడ గ్రామంలో జరిగిన “స్వచ్చా సర్వేక్షన్” కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ కమీషనర్ లక్ష్మిషా, గౌరవ 64వ వార్డ్ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి మరియు జోనల్ కమీషనర్ శ్రీధర్ పాల్గొన్నారు. గౌరవ కార్పొరేటర్ మాట్లాడుతూ… “మన చెత్త – మన బాధ్యత” మరియు “ప్లాస్టిక్ సంచులు వద్దు – గుడ్డ సంచులు ముద్దు” అనే నినాదం చెప్పడం జరిగింది. అలాగే “తడి చెత్త – పొడి చెత్త” వేరుచేసి పారిశుధ్య కార్మికులకు అందజేయాలని కోరుతూ… ప్లాస్టిక్ రహిత విశాఖపట్నంగా చేయాలని, దీనిలో అక్కడ ఉన్న ప్రజలు అందరూ భాగస్వామ్యం అవ్వాలి అని చెప్పడం జరిగింది. అలాగే యారాడ గ్రామంలో ఉన్న సమస్యలు రోడ్లు డ్రైనులు. లీకేజ్ వాటర్ మరియు సులభకాంప్లెక్స్ డెవలప్మెంట్ యారాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి జట్టి వరకు లైట్స్ నిర్మాణం, స్మశాన వాటిక నిర్మాణం కమీషనర్ దృష్టికి తీసికెళ్లడం జరిగింది అలాగే వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే కమీషనర్ స్పందిస్తూ వెంటనే పనులు అన్ని జరగాలని అధికారులును ఆదేశాలు జారిచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్ శ్రీధర్ మరియు డి.ఎం.హెచ్.ఓ జివిఎంసి లో ఉన్న మొత్తం సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ మరియు శానిటేషన్ సెక్రటరి మరియు శానిటేషన్ ఇన్స్పెక్టర్, గ్రామ పెద్దలు మరియు మహిళలు పాల్గొన్నారు.