తెలంగాణలో ఆక్సిజన్‌ కొరత లేదు: మంత్రి ఈటల

హైదరాబాద్: తెలంగాణలో ఆక్సిజన్‌ కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లోనూ ఆక్సిజన్‌ కొరత లేదని స్పష్టం చేశారు. అన్ని జిల్లాలకు ఆక్సిజన్‌ను రవాణా చేస్తున్నామన్నారు. ఆర్మీ విమానాల ద్వారా ఆక్సిజన్‌ తెచ్చుకున్నామని తెలిపారు. 4 లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు గతంలోనే ఆర్డర్‌ ఇచ్చామని వ్యాఖ్యానించారు. ఆక్సిజన్‌ పర్యవేక్షణకు ఐఏఎస్‌ అధికారుల నియామకం చేపట్టినట్లు తెలిపారు. పీఎం కేర్‌ నుంచి 5 ఆక్సిజన్‌ మిషన్లు వచ్చాయన్నారు. ప్రస్తుతం రోజుకు 270 టన్నుల ఆక్సిజన్‌ అవసరమని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.