‘నూటొక్క జిల్లాల అందగాడు’ ట్రైలర్ రిలీజ్!

అవసరాల శ్రీనివాసరావుకి నటుడిగా .. దర్శకుడిగా .. రచయితగా మంచి పేరు ఉంది. ఆయన రచయితగా పనిచేస్తూ, కథానాయకుడి పాత్రను పోషించిన చిత్రంగా ‘నూటొక్క జిల్లాల అందగాడు’ రూపొందింది. సాగర్ రాచకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో హీరో ‘బట్టతల’ సమస్యతో బాధపడుతూ ఉంటాడు. బట్టతల ఉంటే పెళ్లి కాదని భావించి, విగ్గు పెడతాడు. తాను ప్రేమిస్తున్న అమ్మాయి దగ్గర ఆ నిజాన్ని దాచడానికి నానా తంటాలు పడుతుంటాడు. ఇలా బట్టతల కారణంగా ఇబ్బందులు పడుతూ అందులోనే నవ్వులను పూయించే కథగా ఈ సినిమా కనిపిస్తోంది.

అవసరాల శ్రీనివాస్ సరసన రుహాని శర్మ నటించిన ఈ సినిమాకి, శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని సమకూర్చాడు. శిరీష్ .. రాజీవ్ రెడ్డి .. సాయిబాబు నిర్మించిన ఈ సినిమాను, వచ్చేనెల 3వ తేదీన విడుదల చేయనున్నారు. బట్టతలను దాచే విషయంలో అవసరాల చేసే సందడి ఏ స్థాయిలో ఉంటుందనేది తెరపైనే చూడాలి.