పవన్ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక దిగజారుడు రాజకీయం చేస్తున్న జగన్

  • సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు

సర్వేపల్లి నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు శనివారం మనుబోలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. రెండవ విడత వారాహి విజయ యాత్రలో భాగంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఒక పెళ్లి చేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ రెడ్డి, సిబీఐ దత్తపుత్రుడు ఎక్కడా కూడా శంకుస్థాపనలకు గాని, స్వామి వార్ల కళ్యాణాలకు గాని దంపతులుగా పోలేని స్థితిలో ఉన్న ముఖ్యమంత్రి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి శుక్రవారం వెంకటగిరిలోని నేతన్న హస్తం బటన్ నొక్కడానికి వచ్చి అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటలకి దీటుగా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే అక్కడ మా అధినేత పెళ్లిళ్ల గురించి మాట్లాడినటువంటి దిగజారుడు రాజకీయాన్ని చేస్తున్నటువంటి అవినీతి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలని, 22 మంది ఎంపీలను ఇచ్చి ఆయనకి అధికారాన్ని కట్టపెడితే రాష్ట్ర ప్రజలని, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమేమి చేస్తున్నారో వాటిపై దృష్టి పెట్టిన పరిస్థితి. అయితే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అడిగింది వాలంటీర్ వ్యవస్థని తీసుకువచ్చారు. మంచిదే అయితే వీళ్ళకి పై అధికారి ఎవరు? అదే విధంగా వీళ్లల్లో కొంతమంది ఆడబిడ్డలపైన అత్యాచారాలు పెన్షన్లకి ఇచ్చినటువంటి నిధులని అపహరించడం. అదేవిధంగా వీళ్ళు చేస్తున్నటువంటి కొంతమంది కొన్ని వికృత చేష్టలకి సంబంధించి వీళ్ళకి పై అధికారికి తెలియజేయాలంటే ఎవరికి తెలియజేయాలి. అదేవిధంగా ఒక కుటుంబ సభ్యుడి యొక్క ఆధార్ కార్డు కావచ్చు, అతను పర్సనల్ డేటా కావచ్చు ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు. ఎంతమంది ఒంటరి మహిళలు ఉన్నారు అనే విషయాలని డేటా తీసుకుంటున్నారు. అలా తీసుకున్న డేటా తెలంగాణలోని హైదరాబాదులో ఎఫ్ఓఏ ప్రవేటు ఏజెన్సీకి వెళుతుంది. ఆ ఏజెన్సీ ఎవరిది? ఆ ఏజెన్సీ వెనుక ఉన్నది ఎవరు? అదేవిధంగా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి డేటా వాలంటీర్లకి ఎందుకు ఇవ్వాలి. ఆ డేటా సైబర్ నేరగాళ్ళ చేతులకు వెళితే ఒంటరి మహిళల పరిస్థితి ఏంది?. ఆడబిడ్డలు పరిస్థితి ఏంది?.. అనేటువంటి అనేక విషయాలు మీద ప్రశ్నల వర్షం కురిపిస్తే దానికి సమాధానం చెప్పలేక తత్తర బిత్తర పోతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగినదానికి సమాధానం చెప్పలేక మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పిల్లలు గురించి మాట్లాడుతున్నారంటే మరి ఇంతకంటే దరిద్రం ఇంకేముంది. ఇకనైనా ప్రజలు కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా. ఈ కార్యక్రమంలో మనుబోలు మండలధ్యక్షులు ప్రసాద్, మండల నాయకులు జాకీర్, సందీప్, సుధాకర్, ఖాజా, శ్రీహరి, వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు.