పర్సనల్ గా విమర్శించలేదు.. ఒకరి మీద ఒకరి గౌరవం ఉంది

ఇటీవల  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించడం తనకు నచ్చలేదని ప్రకాశ్‌రాజ్‌ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం రాను రాను హాట్ టాపిక్ గా మారి తారాస్థాయికి చేరింది. కాగా ప్రకాష్ రాజ్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ విషయంపై మాట్లాడిన ప్రకాష్ రాజ్ సెట్స్ లో అలాంటివి పట్టించుకోమని క్లారిటీ ఇచ్చారు. నటులుగా మేము కలిసి పని చేసాం.. అంతేకాదు ఒకరి మీద ఒకరి గౌరవం ఉంది అని తెలిపాడు. అయినా పవన్ కు నేను తన ఐడియాలజీని విమర్శించానని.. పర్సనల్ గా తనని విమర్శించలేదని తెలుసు అని అన్నారు. రాజకీయంగా అభ్యంతరాలు ఉండవచ్చు అవి పర్సనల్ లైఫ్ కు తీసుకురాకూడని స్పష్టం చేశారు.