స్పెషల్ డైట్‌లో ‘వకీల్‌సాబ్‌’.. ద్రవ పదార్థాలు మాత్రమే

పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  నటిస్తున్న తాజా చిత్రం  ‘వకీల్‌సాబ్‌’ ఈ సినిమా కోసం స్పెషల్ డైట్‌ ఫాలో అవుతున్నారు పవర్ స్టార్.  ‘వకీల్‌సాబ్‌’ చిత్రం ఇప్పటికే తుది దశ చిత్రీకరణకు చేరుకుంది. ఇటీవలే ఆయనపై కోర్టు నేపథ్యంగా వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక పవన్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ మిగిలి ఉంది. అయితే ఇందుకోసం ఆయన కాస్త సన్నపడాల్సి ఉందట. అందుకే ఇప్పుడాయన తన బరువు తగ్గించుకునేందుకు ప్రత్యేకంగా ఓ లిక్విడ్‌ డైట్‌ ఫాలో అవుతున్నారని సమాచారం.

ఇందులో భాగంగా ద్రవ పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నారని తెలిసింది. డిసెంబరు మూడో వారం నుంచి ఈ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ ప్రారంభం కానుంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. అంజలి, నివేదా థామస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రుతిహాసన్‌ కీలక పాత్రలో కనిపించనుంది.