వివేక్ ఒబేరాయ్ భార్యకు నోటీసులు

బాలీవుడ్‌తో పాటు శాండల్‌వుడ్‌ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కేసు కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కన్నడ నటీనటులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు బెంగళూరు పోలీసులు. అయితే నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం వివేక్ ఒబేరాయ్ బావమరిది ఆదిత్య ఆళ్వా డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉండటంతో  ఆదిత్యను పట్టుకునే చర్యల్లో భాగంగా కోర్టు వారెంట్‌తో గురువారం ముంబయిలోని అతడి బంధువైన వివేక్ ఒబెరాయ్ నివాసంలో సోదాలు చేశారు. అంతేకాదు. ఆయన భార్య ప్రియాంక అల్వా ఒబెరాయ్‌కు క్రైం బ్రాంచ్‌ ఇవాళ( శుక్రవారం) నోటీసులు జారీ చేసింది. సోదరుడు ఆదిత్య అల్వాతో శాండల్‌వుడ్ డ్రగ్ కేసుకు సంబంధించి ప్రియాంకకు కూడా సంబంధాలు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆదిత్య అళ్వా .. మాజీ మంత్రి జీవరాజ్‌ ఆళ్వా కుమారుడు అన్న విషయం తెలిసిందే.