అగ్ని ప్రమాదంపై స్పందించిన నాగ్‌

బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని, ఈ రోజు ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయని ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలూ బయటకు వచ్చాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని, పెద్దగా ఆస్తి నష్టం జరగలేదని తెలిసింది. అయితే ఈ ప్రమాదంపై ఇప్పుడు నాగార్జున స్పందించారు. పొద్దుట నుంచి స్టూడియోలో అగ్ని ప్రమాదంపై వార్తలు వస్తున్నాయని, అలాంటిదేం జరగలేదని, అంతా బాగానే వుందని, అది ఓ తప్పుడు వార్త అని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు నాగ్ ఓ ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందన్నది నిజం. అది చిన్నదా, పెద్దదా? దాని వల్ల నష్టం ఎంత ? అనేది పక్కన పెడితే. స్టూడియోలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. దాన్ని గుర్తించిన సిబ్బంది.. సకాలంలో స్పందించి ఆర్పేశారు కూడా. అయితే ఈ ఇష్యూని నాగ్ పెద్దది చేయదలచుకోలేదు. అందుకే ఇలా స్పందించాల్సివచ్చిందని తెలుస్తోంది.