DRDOలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్…

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మే 17 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్-NAPS పోర్టల్‌ https://apprenticeshipindia.org/ లో రిజిస్టర్ చేయాలి.

ఖాళీల వివరాలు:

మొత్తం ఖాళీలు- 79

ఫిట్టర్- 14

మెషినిస్ట్- 6

టర్నర్- 4

కార్పెంటర్- 3

ఎలక్ట్రీషియన్- 10

ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 9

మెకానిక్ (మోటార్ వెహికిల్)- 3

వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 7

కంప్యూటర్ అండ్ పెరిఫెరల్స్ హార్డ్‌వేర్ రిపేర్ అండ్ మెయింటనెన్స్ మెకానిక్- 2

కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)- 5

డిజిటల్ ఫోటోగ్రాఫర్- 6

సెక్రెటేరియల్ అసిస్టెంట్- 8

స్టెనోగ్రాఫర్ (హిందీ)- 1

స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్)- 1

గుర్తుంచుకోవాల్సిన అంశాలు:

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మే 17

విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.

దరఖాస్తు విధానం- ముందుగా అభ్యర్థులు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్-NAPS పోర్టల్‌ https://apprenticeshipindia.org/ లో అప్లై చేయాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని, అవసరమైన డాక్యుమెంట్స్‌తో కలిపి admintbrl@tbrl.drdo.in మెయిల్ ఐడీకి పంపాలి. డాక్యుమెంట్స్ మెయిల్‌లో పంపకపోతే అప్లికేషన్ ఫామ్ తిరస్కరిస్తారు.

ఎంపిక విధానం- మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

స్టైపెండ్- ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ (మోటార్ వెహికిల్) పోస్టులకు రూ.8,050. మెకానిక్ (మోటార్ వెహికిల్), వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్), కంప్యూటర్ అండ్ పెరిఫెరల్స్ హార్డ్‌వేర్ రిపేర్ అండ్ మెయింటనెన్స్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA), డిజిటల్ ఫోటోగ్రాఫర్, సెక్రెటేరియల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ (హిందీ), స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) పోస్టులకు రూ.7,700.