మా దేవుడు నువ్వేనంటున్న ఇప్పటం గ్రామస్తులు

•  పవన్ కళ్యాణ్ చిత్రపటానికి  పాలాభిషేకం

జనసేన సభకు స్థలం ఇచ్చామన్న అక్కసుతో పాలకులు వేధిస్తుంటే.. స్థలం ఇచ్చామన్న కృతజ్ఞతతో శ్రీ పవన్ కళ్యాణ్ అండగా నిలిచారంటున్నారు ఇప్పటం గ్రామస్తులు. మా దేవుడు నువ్వేనంటూ పాలాభిషేకాలు చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరిట ప్రభుత్వం ఇప్పటం గ్రామంలో ఇళ్లు అక్రమంగా కూల్చేయగా.., విషయం తెలుసుకున్న వెంటనే జనసేనాధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి ఆ గ్రామస్తులకు అండగా నిలిచారు. అంతేకాదు మంగళవారం ప్రభుత్వ చర్యల కారణంగా నష్టపోయిన ప్రతి ఇంటికీ రూ. లక్ష ఆర్ధిక సాయం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ప్రకటన పట్ల ఇప్పటం గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకుల్ని పిలిచి అభినందన సభ ఏర్పాటు చేసి మరీ పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని పాలతో అభిషేకించారు.
• జీవితకాలం రుణపడి ఉంటాం
ఇప్పటం ఇళ్ల కూల్చివేత వ్యవహారంలో మాకు అండగా నిలచిన పవన్ కళ్యాణ్ కి జీవితకాలం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా ఇప్పటం గ్రామస్థులు తెలిపారు. స్వయంగా వచ్చి పరామర్శించడంతో పాటు రూ. లక్ష ఆర్ధిక సాయం ప్రకటించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
• జనసేన ముందుండి పోరాడుతుంది – శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్
సమస్య ఎక్కడ ఉంటే జనసేన పార్టీ అక్కడ ఉంటుందని పార్టీ మంగళగిరి నియోజకవర్గం ఇంఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇప్పటం గ్రామానికి ఎలాంటి సమస్య వచ్చినా పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని హఆమీ ఇచ్చారు. కూల్చేవాడు ఉంటే కట్టేవాడు ఉంటడారని., వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూల్చడం మినహా ఎక్కడా ఒక్క నిర్మాణం కూడా చేపట్టిన దాఖలాలు లేవని అప్పారు. ఇప్పటంలో వైసీపీ కూల్చిన ప్రతి ఇంటికి రూ. లక్ష ఆర్ధిక సాయం ప్రకటించిన జనసేనాధినేతకు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పార్టీ నాయకులు, ఇప్పటం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.