అభిమానికి వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్

అభిమానులు కష్టంలో ఉంటే సాయం చేసేందుకు ముందుండే వ్యక్తుల్లో హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.. ఇప్పటికే పలుమార్లు ఈ విషయం నిరూపించుకోగా.. లేటెస్ట్‌గా అనారోగ్యంతో భాధ పడుతున్న తన అభిమాని వెంకన్నతో సంభాషించారు జూనియర్ ఎన్టీఆర్.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాని కోసం పెద్ద మనసు చేసుకున్నారు. గతం కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న తన ఫ్యాన్‌ వెంకన్నను పలకరించి అతనికి భారీ ఓదార్పునిచ్చారు. దీంతో యంగ్‌ టైగర్‌ చూపించిన మానవత్వం, అభిమానంపై ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోజు(03 నవంబర్ 2020) వీడియో కాల్ ద్వారా తన డై హార్డ్ ఫ్యాన్ వెంకన్నతో మాట్లాడి ఆరోగ్యం గురించి సమాచారం తెలుసుకున్నారు. కండరాల డిస్ట్రోఫీతో మంచం మీద ఉన్న వెంకన్న సాధారణ స్థితికి వచ్చిన తర్వాత అతనిని కలుసుకుంటానని ఫోన్‌లో హామీ ఇచ్చిన ఎన్టీఆర్. అతను త్వరగా కోలుకుంటారని ధైర్యం చెప్పారు.