ఎన్టీఆర్ 31 ఖరారు.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజెస్ ఇస్తున్నారు మేకర్స్. ఈ రోజు ఉదయం ఆర్ఆర్ఆర్ నుండి ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్ ఒకటి విడుదల చేయగా, అది అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా చేసింది. ఇక ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుండగా, ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన చేస్తూ ఎన్టీఆర్ కూల్ లుక్ ఒకటి విడుదల చేశారు. ఈ పోస్టర్ ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ చిత్రం ఒకటి ఉందని గతం నుండి వార్తలు వస్తుండగా, ఈ రోజు ఆ సినిమాపై అఫీషియల్ ప్రకటన చేశారు ప్రశాంత్ నీల్. రక్తంతో తడిసిన నేల ఒక్కటి మాత్రమే గుర్తుంచుకుంటుంది, ఒకే ఒక్క ఫోర్స్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ ప్రశాంత్ నీల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.