ఓబీసీ మహిళలకి రిజర్వేషన్ కల్పించాలి

దెందులూరు: బీసీలు ఇప్పటివరకు చట్ట సభల్లో రిజర్వేషన్ సాధించుకోలేకపోయారని కాబట్టి ఇప్పుడు మహిళా బిల్లులో కూడా బీసీ మహిళలకి రిజర్వేషన్ లేకుండా పోయిందని అఖిల పక్షాలు, బీసీ సంఘాల ప్రతినిధులతో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం శుక్రవారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో బహుజన ఉద్యమకారిణి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా. ఘంటసాల వెంకటలక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ దీనికి కారణం బీసీల్లో ఐక్యత లేకపోవడం, పోరాటాలు చేయకపోవడమే. బీసీలు వారి జనాభా దామాషా ప్రకారం చట్ట సభల్లో లేకపోవడం వలనే వారి గొంతుని బలంగా వినిపించలేకపోతున్నారు. 56 కార్పొరేషన్ లు ఇచ్చి వాటికి నిధులు ఇవ్వకుండా చేస్తే ప్రశ్నించే బీసీ కులాల కార్పొరేషన్ చైర్మన్ ఒక్కరూ లేరు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ లకి చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని, బీసీలకి జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో సీట్లు, అదే విధంగా నామినేటెడ్ పదవులు ఇస్తామని, కులాల వారీగా జనగణన జరిపిస్తామని, మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకి రిజర్వేషన్ కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని వెంకటలక్ష్మి పేర్కొన్నారు.