గురజాల జనసేన ఆద్వర్యంలో 3వ రోజు జగనన్న ఇళ్ళు పేదల కన్నీళ్లు

గురజాల: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12, 13, 14 తేదీలలో తలపెట్టిన జగనన్న ఇళ్లు – జనాలకు కన్నీళ్లు అనే కార్యక్రమంలో భాగంగా సోమవారం పిడుగురాళ్ల లోని టిడ్కో ఇళ్ల పరిశీలన మరియు జగనన్న మోసం డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమంలో వైసిపి ప్రభుత్వం చేస్తున్న మోసం ప్రజలకు తెలిసేలా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. నియోజవర్గంలో దాదాపు 70 జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తే వాటిలో కేవలం 4 మాత్రమే పనులు జరుగుతున్నాయని, వాటిలో కూడా వారి పార్టీ నాయకులకు మాత్రమే కట్టిస్తున్నారని, కులం చూడం పార్టీ చూడం అని ఎలక్షన్ కు ముందు మాట్లాడిన జగన్రెడ్డి ఈరోజు వాటిని తుంగలో తొక్కారని సామాన్య ప్రజలకు సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతుందని మండిపడ్డారు, జగనన్న ఇల్లు పేరుతో రాష్ట్రంలో కోట్ల రూపాయల స్కాం జరిగిందని ఆరోపించారు, ఈ కార్యక్రమంలో, మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసిం సైదా, ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, జిల్లా కార్యదర్శులు బడిదల శ్రీనివాసరావు, కటకం అంకారావు, అంబటి మల్లి, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు దూదేకుల సలీం, వేల్పుల చైతన్య, పిడుగురాళ్ల మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్, పెడకొలిమి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శులు గుర్రం కోటేశ్వరరావు, ఆవుల రమేష్, కార్యదర్శులు బేతంచర్ల ప్రసాద్, మట్టం పరమేష్, దీకొండ కిరణ్, రామాయణం రాము, జానపాడు, గ్రామ అధ్యక్షుడు పసుపులేటి నరసింహారావు, అంబటి సాయి, బోజ్జ ఆదినారాయణ, కోట మధు, శ్రీనివాసరావు, కామిశెట్టి అశోక్, పరమేష్, నూతి శేషు, కాకర్ల శ్రీను, నరేష్ మొదలగు వారు పాల్గొన్నారు.