పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం

మదిర, బోనకల్లు జనసేన పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలో స్థానిక వృద్ధాశ్రమంలో శుక్రవారం నాడు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత బోనకల్ మండల జనసేన పార్టీ నాయకులు కేక్ కటింగ్ చేసి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మొదటిగా గార్లపాడులో దేవుని గుడిలో పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ పేరు మీద అర్చనలు చేపించారు. అనంతరం బోనకల్లు లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు తాళ్లుడ్ డేవిడ్ మాట్లాడుతూ జనసేన పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషిచేసి పవన్ కళ్యాణ్ ని అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని కోరారు. రానున్న 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపుకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని తాళ్లూరి డేవిడ్ పిలుపునిచ్చారు. మండల సెక్రెటరీ అద్దంకి సంతోష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఎస్.కే జానీ పాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోదుగు పవన్, ఖమ్మం జిల్లా జనసేన విద్యార్థి విభాగ ఎగ్జిక్యూటివ్ నెంబర్ గంధం ఆనంద్, వేముల వినయ్ కుమార్, సజ్జనకు భరత్ సోషల్ మీడియా నాయకులు, బోనకల్ మండల జనసేన పార్టీ నాయకులు మోదుగు రాజా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.