కొనసాగుతున్న డాక్టర్ కందుల పర్యటనలు

  • దక్షిణంలో పలు వార్డులలో పర్యటనలు
  • జనసేన పార్టీ ఆదేశాలతో పలు వరుస కార్యక్రమాలు
  • పార్టీ పటిష్టతకు కృషి
  • పుష్పవతి అమ్మాయిలకు వెండి పట్టీలు, పట్టుబట్టలు అందచేత

వైజాగ్ సౌత్: విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీకి రోజురోజుకు మరింత ప్రజాదరణ పెరుగుతుందని ఆ పార్టీ నియోజకవర్గపు నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. బుధవారం ఆయన పలు వార్డులలో పర్యటించి ప్రజా సమస్యలను నేరుగా ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో జనసేన అధికారంలోకి వస్తే చేపట్టబోయే మంచి పనులను కూడా వివరించారు.
ఈ పర్యటనలో భాగంగా పుష్పవతి అయిన 34 వ వార్డు బూపేష్ నగర్, లక్ష్మీదేవి పేట ప్రాంతాలకు చెందిన సాహినా రహినా అనే అమ్మాయితో పాటు మరో అమ్మాయికి కూడా వెండి పట్టిలు, పట్టుబట్టలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీకి అంతకంతకు ఆదరణ పెరుగుతుందని చెప్పారు. ఇక్కడ ప్రతి ఒక్కరు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. జనసేన అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందని ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా దక్షిణ నియోజకవర్గం ప్రజలు జనసేన ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వాసుపల్లి నరేష్, లుక్స్ గణేష్, ఉమ్మడి గురుమూర్తి, బొగ్గు శ్యామ్, లక్ష్మణ్, ప్రసాద్,సతీష్ బద్రి, వెంకటేష్, శ్రీదేవి, జోతి, జోగా లక్ష్మి, దేవి, కుమారి, దక్షిణ నియోజవర్గం యువ నాయకులు కేదార్నాథ్, బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.