భారత్, చైనా సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత వాతావరణం

భారత్, చైనా సరిహద్దు ప్రాంతం తూర్పు లడఖ్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎల్ఏసీ వద్ద భారత్, చైనా దళాల హెచరిక కాల్పులు జరిపాయి. చైనా బలగాలు పాంగాగ్ సో సరస్సు ప్రాంతానికి భారీ ఎత్తున రావడంతో అప్రమత్తమైన భారత్ ఈ సారి ఓ పక్క చర్చలు జరుగుతుండగానే చైనా బలగాలను తిప్పికొట్టేందుకు భారీగా సైన్యాన్ని మొహరించింది.

యాంటీ ట్యాంక్ మిసైళ్లను భారత్ భారీ ఎత్తున అక్కడికి తరలించి చైనా కవ్వింపు చర్యలపై  బదులిచ్చేందుకు కూడా సిద్దమైంది. ఈ క్రమంలోనే ఇరు  దేశాల బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. కాగా భారతే మొదట కాల్పులకు పాల్పడిందని చైనా ఆరోపిస్తోంది.