రాజ్‌భవన్‌లో ఈ-ఆఫీసు ప్రారంభం.. డాక్టర్ సౌందర్ రాజన్ ను సన్మానించిన కేసీఆర్

రాజ్‌భవన్‌లో ఈ-ఆఫీసును గవర్నర్‌ తమిళిసై ప్రారంభించారు. రాజ్‌భవన్ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా రాజ్‌భవన్‌ పనిచేస్తుందని తమిళిసై ప్రకటించారు. గత నాలుగు నెలల నుంచి ఈ-ఆఫీస్ పద్దతిని అవలంభిస్తున్నామని వెల్లడించారు.

ప్రముఖ నెఫ్రాలజిస్ట్, బెస్ట్ మెడికల్ టీచర్, డాక్టర్ సౌందర్ రాజన్ కు ధన్వంతరి అవార్డు వచ్చినందుకు సీఎం కేసీఆర్ ఇవాళ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి ఆయనను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో ఈ-ఆఫీసు నిర్వహణపై గవర్నర్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం కూడా సచివాలయంలో ఈ-ఆఫీస్ విధానం అమలు చేస్తున్నందుకు ఆమె అభినందనలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ-ఆఫీసే మేలని గవర్నర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉండటం గర్వంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు.