ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి: నేమూరి శంకర్ గౌడ్

  • తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్

కూకట్ పల్లి నియోజకవర్గం: గత 14 రోజులుగా జి.హెచ్.ఎం.సీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని, తమను పర్మినెంట్ చేయాలని నిరసన చేపట్టినారు. కావున శనివారం జూబ్లీహిల్స్ లో కార్మికులు నిరసన చేస్తున్న శిబిరానికి వెళ్లి వారికి అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ భరోసానిచ్చి మద్దతు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అద్యక్షులు రాదారం రాజలింగం.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి, సురేష్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ నందగిరి సతీష్ కుమార్, పఠాన్ చేరు ఇంచార్జ్ యడమ రాజేష్, మహేష్, కార్మిక నాయకులు దుర్గాప్రసాద్, జి.హెచ్.ఎం.సీ నాయకులు రాజు, శ్రీధర్ గారితో పాటు జనసేన శ్రేణులు భారీగా పాల్గొన్నారు.