నవంబర్ లో ఆక్స్ ఫర్డ్ టీకా

కరోనా వ్యాక్సిన్ కోసం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నది. ఈ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తెచ్చేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సహాకారంతో బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ ఝఏజెడ్ డీ-1222 చివరి దశ క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. నేటి నుంచి ముప్పైవేల మందికి రెండు డోసేజీలు ఇవ్వనున్నారు. ఈ ఫలితాల ను నమోదు చేసి అమెరికా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

అన్నీ అనుకున్నట్లుగా ముందుకు సాగితే నవంబర్ కల్లా టీకా అందుబాటులోకి తేవాలని ట్రంప్ ధృడ నిశ్చయంతో ఉన్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సౌతాఫ్రికా, బ్రిటన్, బ్రెజిల్ దేశాల్లో చివరి దశ పరీక్షలు నిర్వహిస్తున్నది.