విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్ లో పి.గన్నవరం నియోజకవర్గం

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ప్రకటించిన సోషల్ మీడియా క్యాంపెయినకి మద్దతుగా పి. గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం చెందిన జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ శిరిగినీడి వెంకటేశ్వర ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అదే నినాదంతో జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దొమ్మేటి సాయి కృష్ణ, సుంకర నాయుడు, మైపాల తాతాజీ, యర్రంశెట్టి నాగేంద్ర, మదింసెట్టి విజయ్, కొప్పినీడి సాయి సూర్య, నల్లా కిషోర్, మెడిది శ్రీను తదితరులు పాల్గొన్నారు.