అయినవిల్లి జనసేన ఆధ్వర్యంలో పాదయాత్ర

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం కే.జగన్నాధపురం గ్రామం నుండి ముక్తేశ్వరం వరకు అద్వానంగా ఉన్న రోడ్ల సమస్యపై నడుం బిగించిన జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు కే.జగన్నాధపురం నుండి తొత్తరమూడి, ముక్తేశ్వరం వరకూ పాదయాత్ర చేపట్టిన జనసేన పార్టీ శ్రేణులు. “అడుగుకో గుంత గజానికో గొయ్యి” అనే నినాదాలు చేసి పాదయాత్రను చేపట్టారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేసిన జనసైనికులు. ప్రభుత్వానికి గడువు పెట్టిన జనసేన పార్టీ శ్రేణులు. వారం, పది రోజుల్లో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో అఖిలపక్షాలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అయినవిల్లి మండలం నుండి అధికసంఖ్యలో జనసేన పార్టీ శ్రేణులు, అమలాపురం నియోజకవర్గ జనసేన నాయకులు లింగోలు పండు, జనసేన పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస, జనసేన నాయకులు నల్లా వెంకటేశ్వరావు, వర్రే శేషు, కొంకాపల్లి వార్డు సభ్యురాలు శ్రీమతి తిక్క సరస్వతి పాల్గొనడం జరిగింది.