‘పాగల్’ రిలీజ్ డేట్ ఖరారు!

విష్వక్సేన్ హీరోగా బెక్కెం వేణుగోపాల్ ‘పాగల్’ సినిమాను నిర్మించారు. నరేశ్ కుప్పిలి నిర్మించిన ఈ సినిమా, ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. అలాంటి ఈ సినిమాకి ఇప్పుడు రిలీజ్ డేట్ ను ఖరారు చేసి ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను వదిలారు.

ఇటు యూత్ ను .. అటు మాస్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాలో విష్వక్ సేన్ జోడీగా నివేదా పేతురాజ్ .. సిమ్రన్ చౌదరి కనువిందు చేయనున్నారు. రధన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.

మురళీశర్మ .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.’హిట్’ సినిమా తరువాత విష్వక్ సేన్ చేసిన మూవీ ఇది. ఈ సినిమా తప్పకుండా విడుదలవుతుందనే బలమైన నమ్మకంతో ఆయన ఉన్నాడు. మరి ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.