పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన చోటే పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం

కుప్పం నియోజకవర్గం: రామకుప్పం మరియు శాంతిపురం మండల పరిదిలో పూర్తిగా అవగాహన లేకుండా కొంతమంది వాలంటీర్స్ అని చెప్పుకొనే వైసీపీ మద్దతుదారులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను ఎక్కడైతే దగ్ధం చేసారో అక్కడే జనసేన పార్టీ తరఫున జనసేన నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి బుధవారం పవన్ కళ్యాణ్ గారికి పాలాబిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి సంబంధించిన రాష్ట్ర, జిల్లాకార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, మండల కార్యవర్గ సభ్యులు జనసేన నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపడం జరిగింది.