శ్రీ శ్రీ రావులమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న బండారు శ్రీనివాస్

  • శ్రీ శ్రీ రావులమ్మ తల్లి వారి కరుణా కటాక్షంతో ప్రజలందరు సుఖ సంతోషాలతో జీవించాలి: బండారు శ్రీనివాస్

కొత్తపేట నియోజక వర్గం, ఆలమూరు గ్రామములో గ్రామ దేవత శ్రీ శ్రీ రాములమ్మ ప్రతీ ఏటా జరిగే జాతర మహోత్సవ కార్యక్రమంలో జనసైనికుల ఆత్మీయ ఆహ్వానం మేరకు కొత్తపేట నియోజక వర్గం జనసేన ఇంఛార్జి బండారు శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కరుణ కటాక్షలతో దయతో గ్రామస్థులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపు కాస్తూ ఉండే దేవత బహు విశిష్ఠత కలిగి పుట్టింటి నుండి అత్తవారింటికి సాగనంపే క్రమంలో ఘనంగా ఊరేగింపు జరుపుతూ అమ్మవారి దివెననలతో సస్యశ్యామలంగా ఉండడం కొరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలమూరు గ్రామ దేవత శ్రీ శ్రీ రావులమ్మ తల్లి పూజావిధానం తరతరాలుగా వస్తున్న గ్రామీణ సంప్రదాయం అని అన్నారు. అత్యంత భక్తశ్రద్ధలతో ప్రజలందరు పెద్ద యెత్తున బాణ సంచా కాల్చి ఘనంగ ఊరేగించడం పట్ల ప్రజలకున్న ఆథ్యాత్మికను అభినందనలు తెలిపారు. మానవుడు నిత్య జీవితంలో ఎన్నో జయాపజయాల్ని చవి చూస్తు, మరో వైపు తన లక్ష్య సాధనకోసం ఎన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్నా కూడా ఆథ్యాత్మిక విషయంలో రాజీ పడకుండా మాత్రం భక్తీ శ్రద్ధలు కలిగి జీవించడం, తాము నివిసిస్తున్న ప్రాంతాలూ, తమ తమ కుటుంబాల కొరకు ప్రత్యెక ప్రార్థనలు నిర్వహిస్తూ, దేశ విదేశాల్లో,వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపారాలు, నిర్వహిస్తున్న ప్రతి ఏటా జనవరి లో ఘనంగా జరిగే మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్టికి మూల కారకురాలు రాములమ్మ తల్లి అని గ్రహించి, ఆమెను సంతృప్తి పరచేటందుకు ఎన్నో మార్గాలను అందులో ప్రార్థన, మంత్రతంత్రాలు, పవిత్రీకరణ, ఆత్మహింస, బలి అనేవి ప్రధానంగా కనిపిస్తాయి అని బండారు శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ల డేవిడ్, మహాదశ బాబులు, బండారు అబ్బులు, కురసా వెంకన్న, కొత్తపల్లి నగేష్, చల్లా వెంకటేశ్వరరావు, చల్లా బాబి, సిరిగినేడి పట్టాభి, దాసి మోహన్, పంపన సురేష్, కట్టా రాజు, కోట వరలక్ష్మి, జనసైనికులు పాల్గొన్నారు.