పెడనలో జనసేనాని పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం

పెడన: వాలంటీర్లను రెచ్చకొట్టి పవన్ కళ్యాణ్ ఫోటోలు పెడనలో తగులబెట్టిన ఘటనను ఖండిస్తూ.. పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ పిలుపు మేరకు జనసేన నాయకులు మంగళవారం పెడన పట్టణములో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న గాంధీ కాంప్లెక్స్ నందు గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లను ఎక్కడ కించపరచలేదు, అవమనించలేదు వైసిపి అనుకూల వాలంటీర్లను అడ్డుపెట్టుకుని కొంతమంది నాయకులు చేస్తున్న కొన్ని అవినీతి అక్రమాలను మాత్రమే అన్నారన్నారు. వాలంటీర్లకు 5 వేల రూపాయల జీతం ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆయన అన్నారు. వాలంటీర్ అని మభ్యపెట్టి ప్రభుత్వ ఉద్యోగాల ఊసు ఎత్తకుండా వయస్సు అర్హతలో 4 ఏళ్ల వాలంటీర్లు భవిష్యత్తు నాశనం చేస్తున్నారని అన్నారు. వాలంటీర్ల దగ్గర డేటా సేకరించి కొంతమంది వ్యక్తులు అసాంఘిక కార్యకలపాలకు వాడుతున్నారన్నారు. జీవితాల్లో ఎదిగే అవకాశాలు లేకుండా వాలంటీర్లకు 5 వేల దగ్గరే ఆపేసి వాలంటీర్లకు అడ్డుపెట్టుకుని వైసిపి నాయకులు ఎదుగుతున్నారని మాత్రమే శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు అని గుర్తు చేశారు. ఈ విషయాన్ని వాలంటీర్లు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కూనపరెడ్డి రంగయ్య, సయ్యద్ షఫీ, పోలగాని లక్ష్మీ నారాయణ, గోట్రు రవి కిరణ్, వరుదు రాము, పుల్లేటి దుర్గారావు, క్రోవి సుందరరాజు, కొప్పినీటి శివమని, పయ్యావుల నాగంజనేయులు, దివి శ్రీనివాస్, కొప్పినేటి నరేష్, కొండ, సింగంశెట్టి అశోక్ కుమార్, కొఠారి మల్లి బాబు, కటకం మహేష్, నందం శివ స్వామి, గడ్డిగోపుల నాగ, వన్నెంరెడ్డి సాయి కిరణ్, నరహరి శెట్టి ప్రసాద్, బాదం వినోద్, ఆనందాస్ బాలాజీ, బాకీ నాని, షేక్ మున్నా, పవన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.