ఫైట్ మాస్టర్ బద్రిని మర్యాదపూర్వకంగా కలిసిన పాలకొండ జనసేన నాయకులు

పాలకొండ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో 1995లో పరిచయంతో మొదలైన పరిచయం నాటి నుంచి పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో పవన్ కళ్యాణ్ మద్దతుతో ఫైట్ మాస్టర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టి నేటికి తెలుగు ఇండస్ట్రీ అగ్ర హీరోలందరితో అందరి సినిమాలలో ఫైట్ మాస్టర్ గా కంపోజ్ చేసి మెగా ఫ్యామిలీ హీరోస్ అందరిలో ఒకడిగా కుటుంబ సభ్యులలో కలిసిపోయినటువంటి బద్రి అన్న తన సొంత గ్రామం శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం మొట్ట గ్రామం కావడం ఒక గర్వకారణం ఒక మారుమూల ప్రాంతంలో జన్మించి ఈరోజు ఒక గొప్ప ఫైట్ మాస్టర్ గా పేరు ప్రఖ్యాతలు పొందుతున్నాను అంటే అది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రాం లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ వల్లనే అని ఎన్నో సందర్బంలో చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తి తన సొంత ఊరు మొట్ట వచ్చిన సందర్బంగా బొడ్లపాడు జనసేన యువత మర్యాదపూర్వకంగా వెళ్ళి కలిసి వారిని అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా బద్రి జనసేన జానీ ఆటో చూసి అభినందించడం జరిగింది.