పాలకొండ జనసేన ఆధ్వర్యంలో స్వామి వివేకానందకు ఘన నివాళులు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజక వర్గం, వీరఘట్టం మండలం నడుకురు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ స్వామి వివేకానంద 160వ జయంతి మోహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్ మత్స పుండరీకం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువకులు అందరూ స్వామి వివేకానంద ని స్ఫూర్తి గా తీసుకోవాలని, ప్రపంచంలో అత్యధిక సాతం యువత వున్నది భారతదేశంలొనే. యువతతో నిండివున్న మనదేశం. నేటి యువతను రాజకీయ లోకి ఆహ్వానిస్తూ మన ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశాన్ని అభివృద్ధి చేసుకుందాం అంటున్న ఏకైక రాజకీయ పార్టీ జనసేన పార్టీ మాత్రమే అని అన్నారు. యువత కి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యపడుతుందని మత్స. పుండరీకం అన్నారు. అనంతరం జనసేన పార్టీ యువశక్తి కార్యక్రమానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో దండేల సతీష్, ముద్ద సంతోష్, కర్ణేన సాయి పవన్, వావిలపల్లి నాగభూషన్, మాచర్ల చందు, సాయి, దండేలా చందు తదితరులు పాల్గొన్నారు.