పంచాయతీ నిధులు అన్యాక్రాంతంపై దర్యాప్తు జరిపించాలి!

  • నిధులు విడుదల చేసి, కనీస సౌకర్యాలు కల్పించాలి

కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో తెలుగుదేశం నాయకులతో కలిసి 70 రోజులు ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రతీ గ్రామంలోని కనీస అవసరాలు త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం లేదని, వీధి దీపాలు లేవని, స్మశానంలో సరైన సదుపాయాలు లేవని, దోమలు ఎక్కువగా ఉన్నాయని, వైద్య సౌకర్యం కల్పించాలని అదేవిదంగా పంచాయతీ నిధులు అన్యాక్రాంతం అయ్యాయని, వాటిపై సరైన దర్యాప్తు జరిపించి, దోషులకు శిక్షించాలని, వెంటనే పంచాయతీలకి నిధులు విడుదల చేసి, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జనసేన శ్రేణులు, టీడీపీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపి అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీమతి క్రితిక శుక్ల గారికి తెలుగుదేశం నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు, వివై దాసు, సీతయ్య దొర గార్లతో కలిసి వినతిపత్రం అందించిన కాకినాడ రూరల్ జనసేన, టీడీపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ.. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది అని తెలిపారు.. ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు మరియు తెలుగుదేశం నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.