జయచంద్ర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మదనపల్లి జనసేన నాయకులు

తంబళ్ళపల్లి, జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తంబళ్ళపల్లి జనసేన-తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి జై చంద్రరెడ్డిని మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు, జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, నా సేనకు నా వంతు కమిటీ మెంబర్ శ్రీమతి దారం అనిత, మదనపల్లి సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, జనసేన మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాయిని జగదీష్ బాబు, మదనపల్లి జనసేన నాయకులు కుప్పాల శంకర, అశ్వత్, ధరణి, సోను, హర్ష, శ్రీనాథ్, తక్కోళ్ల శివ, గణేష్, అశోక్, నవాజ్, శేఖర, బహదుర్, మహిళా నాయకులు శ్రీమతి మల్లికా శ్రీమతి రూప తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జయచంద్ర రెడ్డి మాట్లాడుతూ తంబాలపల్లి నియోజకవర్గంలో జనసేన క్యాడర్ తమకు చాలా బాగా సహకరిస్తుందని ప్రతి మండలం పర్యటిస్తున్నప్పుడు పెద్ద సంఖ్యలో వచ్చి తమతోపాటు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.