మీ కళ్ళకు గంతలు తీస్తే… రోడ్లపై గుంతలు కనిపిస్తాయి

* ప్రజా క్షేత్రంలో తిరిగితే అసలు విషయం తెలుస్తుంది

* గంజాయి రవాణా చేస్తున్నవాళ్ళు కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు

* ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు

* కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై మంత్రి దాడిశెట్టి రాజా చేసిన అనుచిత వ్యాఖ్యలను పత్రిక సమావేశంలో ఖండించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ , ముత్తా శశిదర్ … మీడియా తో మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వైసిపి సకల కళ మంత్రులు మతిభ్రమించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు..

కాకినాడ జిల్లాకు చెందిన మంత్రి దాడిశెట్టి రాజా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అధిష్టానం రాసిచ్చిన స్క్రిప్ట్ లను చదువుతూ ప్రజలను యామారుస్తున్నారని, మండపేటలో నిర్వహించిన జనసేనాని రైతు భరోసా యాత్ర విజయవంతం కావడంతో వైసిపి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని దానితో ఏం చేయాలో తెలియక ఇటువంటి ఆరోపణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత 3రోజులుగా ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితి పై పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే డిజిటల్ కాంపెయిన్ 3గంటల పాటు ప్రధమస్థానంలో నిలిచిందని తెలిపారు.. మీరు 2205 కోట్లు సుమారు ఖర్చు చేశామని చెబుతున్నారు, దేనికి ఎంత ఖర్చు చేసారో చెప్పగలరా?.. రోడ్స్ కి ఇన్ని నిధులు ఖర్చు చేసిఉంటే ఇన్ని వేల కిలోమీటర్లు రోడ్డు ఇంత దారుణంగా ఉన్నాయి… కళ్యాణ్ గారు వస్తున్నారు అని తెలిస్తే చాలు గభ గభ కాంట్రాక్టర్లను పిలిచి వారికీ అడిగినంత ఇచ్చేసి రోడ్లు రిపేర్ చేస్తున్నారు.. మీకు మిగిలిన శాఖ ల విషయం తెలియకపోవచ్చు. కాని మీ శాఖ రోడ్డులు భవనాల శాఖ పై ద్రుష్టి పెట్టండి. మీ సకల శాఖమంత్రి ఇచ్చిన స్క్రిప్ట్ లు చదువుతూ ఉంటే మీ మాజీ మంత్రులు, పేర్ని నాని గారు, కన్నలాబాబు గారు తదితరులకు పట్టిన గతే మీకు పడుతుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి… కామనికి పరాకాష్ట ఎవరో మీకు మీ ఎమ్మెల్యేలకు తెలుసు, మనం ఎన్నో సార్లు మాట్లాడు కున్నాం, తండ్రి చనిపోయే సమయానికి ఎక్కడ యే స్థితిలో ఉన్నాడో అందరికి తెలిసిందే, అయన పదవిలో ఉన్నాడు కాబట్టి మేము అనలేకపోతున్నాము.. మా పార్టీ జోకర్ పార్టీ ఐతే, మీది బ్రోకర్ పార్టీ, జైలు పార్టీ.. కోనసిమకి అంబేద్కర్ కొనసీమ జిల్లా పేరు పెట్టాలని మొట్టమొదట తీర్మానము చేసినది జనసేన పార్టీనే.. నిద్ర పోతున్న మీ ముఖ్యమంత్రిని లేపాలి అనే #GoodMorning CM sir అనే డిజిటల్ క్యాపెయిన్ నిర్వహించాము. దానికి ప్రజలనుండి అపూర్వ స్పందన రావడం చూసి కారు కూతలు కూస్తున్నారు.. మేము మాటలు అనగలం కాని సభ్యత, సంస్కారం అడ్డువస్తున్నాయి.. ఈ జిల్లా గంజాయి స్మగలింగ్ కి అడ్డాగా మారింది.. దీనివల్ల యువత భవిష్యత్తు పాడైపోతోంది అని తెలిపారు… తెలుగు దేశాన్ని కూడా ఆనాడు రోడ్ల కోసం నిలదీసిన సంగతి మీకు తెలియదా..? అంబేద్కర్ స్మృతి వనం కడతాము అని చెప్పారు.. ఏమైంది… పవన్ కళ్యాణ్ గారి పై దాడులు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని.. వాటిని మానుకోవాలని హితవుపలికారు.. ఈ కార్యక్రమంలో కరెడ్ల గోవింద్, తాటికాయల వీరబాబు, బండారు మురళి, పుల్ల శ్రీరాములు, బండారు మణికంఠ, తలాటం దుర్గ బాబు, కర్ని శ్రీనివాస్, కిషోర్, శరత్, గణేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు..