రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుల కుటుంబాలను పరామర్శించిన పంతం నానాజీ

కరప మండలం, నడకుదురులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుగుదురు గ్రామానికి చెందిన షేక్ మోసి, శెట్టిబలిజ పేట నివాసి పెంకు రమేష్ అనే ఇద్దరు యువకులు మరణించడం జరిగింది. విషయంతెలుసుకున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.