వాకలపూడి ఫిషర్ మెన్ కాలనీని సందర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్, మిచౌంగ్ తుఫాన్ కారణంగా మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కాకినాడ రూరల్ మండలం వాకలపూడి ఫిషర్ మెన్ కాలనీ పూర్తిగా మునిగి పోయిందని స్థానిక జనసేన నాయకులు గంట ప్రసాద్, గేదల చిన్నారావు జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీకి తెలియచేయడంతో జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ జనసేన నాయకులతో కలిసి వెంటనే మునిగిపోయిన ప్రాంతాన్ని సందర్శించి స్థానికులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకుని, అధికారులతో ఫోన్ లో మాట్లాడి వెంటనే వారికి సహాయం అందించమని కోరారు. నీరు పోయేలా ఏర్పాటు చేయాలని, స్థానిక జనసేన నాయకులకు తగిన సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.