మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని సత్కరించిన యూఏఈ జనసేన

దుబాయ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలవడం ఒక అదృష్టంగా భావిస్తున్నామని. ఆయనతో కొన్ని విషయాలు చర్చించడం జరిగిందని యూఏఈ జనసేన నాయకులు పాపోలు అప్పారావు, మొయిడ అప్పాజి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల గురించి ఆయన్ని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం చాలా చక్కగా అనిపించింది. ఆంధ్ర పరిస్థితిలో రాష్ట్రాన్ని ఎలా కాపాడాలని అన్న ఒక ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానం “మీరు నేను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితికి ఏమి చేయలేము” ప్రజలందరూ కలిసి ఎన్నుకున్నారు, ప్రజలే మార్పు తీసుకురావాలి. ప్రజల్లో రాజకీయ చేతన్యం రానంత వరకు మార్పు రావడం జరగదని చాలా స్పష్టంగా చెప్పారు. విద్యార్థి దశలో జై ఆంధ్ర ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాలు, జైలుకు వెళ్లిన విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ యొక్క అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఏ కాలేజీలు శాంక్షన్ చేశారు అన్ని వివరించారు. ఇప్పుడు ఆంధ్రలో జరుగుతున్న రాజకీయాలను చూసి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయాలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయని చక్కగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుండి చక్కని రాజకీయాలతో ఒక అత్యుత్తమైన స్థానమైన ఉపరాష్ట్రపతి వరకు వెళ్లడం అనేది చాలా గొప్ప విషయంగా మేము చెప్పడం జరిగింది. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా చెప్పారు. మాతృభాష అని ఎందుకు వచ్చిందో చాలా స్పష్టంగా చెప్పారు. ఇన్ని భాషలు నేర్చుకున్న మంచిదే కానీ మాతృభాషను మర్చిపోవడం అనేది క్షమించడానికి నేరంగా చెప్పారు. ఆయన్ని మర్యాదపూర్వకంగా శాలువతో సత్కరించడం చాలా ఆనందం కలిగించింది. ఈ సందర్భంగా మమ్మల్ని కలిసినందుకు ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది.