పార్లమెంట్ స్థాయి సమావేశం

తిరుపతి నియోజకవర్గం, జనసేన-టీడీపీ-బీజేపీ ఉమ్మడి నాయకులు, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అరణి శ్రీనివాసులు, బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, జనసేన జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప పార్లమెంట్ స్థాయి సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత అధికార పార్టీ ప్రజా జీవితాన్ని నాశనం చేస్తున్న విధానాన్ని చూసి ప్రజల కష్టాలను తీర్చేవారు ఎవరూ లేకుండాపోయారు. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీతో కలసి వైసీపీని తరిమి కొట్టాలని కంకణం కట్టుకున్నారు. జగన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలు అన్ని ప్రజలు తెలుసుకున్నవారు ఈసారి జగన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారు. రాష్ట్ర ప్రజలకు మంచి భవిషత్తును ఇవ్వటమే పవన్ కళ్యాణ్ లక్ష్యం అని తెలియచేసారు. నిస్వార్ధంగా పని చేసే ప్రతి ఒక్క కార్యకర్తకి మంచి భవిషత్తు ఉంటుంది. కూటమిని గెలిపించుకోవటానికి అహర్నిశలు కష్టపడాలి అని ఉమ్మడి అభ్యర్థులందరితో చర్చించారు. రాబోవు ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యంత మెజారిటీతో గెలిపించుకుని పవన్ కళ్యాణ్,చంద్రబాబు నాయుడు, మోడీలకు కానుకలుగా ఇద్దామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ అభ్యర్థి అరణి శ్రీనివాసులు, కాళహస్తి నియోజకవర్గ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి, సత్యవేడు అభ్యర్థి అధిములం, జనసేన-టీడీపీ బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు.