ఎంపిటిసిలకు శుభాభినందనలు తెలిపిన పాటంశెట్టి దంపతులు

జగ్గంపేట, జగ్గంపేట మండలం, రామవరం గ్రామంలో జనసేన పార్టీ తరుపున ఎంపిటిసిగా పోటీ చేసి, గెలిచి, పదవీ బాధ్యతలు చేపట్టి, ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరకాలం పూర్తి చేసుకున్న రామవరం-2 ఎంపిటిసి దొడ్డ శ్రీనుకి జగ్గంపేట జనసేన ఆధ్వర్యంలో చిరు సత్కారం చేయడం జరిగింది. అలాగే గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామం నుండి ఎంపిటిసి గా గెలిచిన చెన్నంశెట్టి చక్రరావుకి, కిర్లంపూడి మండలం తామరాడ గ్రామం నుండి ఎంపిటిసిగా గెలిచిన గోకాడా రాజాకి జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.