కౌలు రైతు భరోసా యాత్రకు పాత్రుని పాపారావు విరాళం

మంగళగిరి: శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలసకు చెందిన మాజీ ఇంటర్మీడియట్ బోర్డ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్, కౌముది విద్యాసంస్థల అధినేత పాత్రుని పాపారావు జనసేన కౌలు రైతు భరోసా యాత్ర కోసం రెండు లక్షల రూపాయల చెక్కును పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్ రావు పాల్గొన్నారు.