జనసేనలో చేరిన కౌముది విద్యాసంస్థల అధినేత పాత్రుని పాపారావు, పొదిలాపు స్వామినాయుడు

ఆమదాలవలస: ప్రముఖ విద్యావేత్త మరియు కౌముది విద్యాసంస్థల అధినేత పాత్రుని పాపారావు మరియు ప్రముఖ వ్యాపారవేత్త పొదిలాపు స్వామినాయుడు ఆముదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ రావు సమక్షంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాత్రుని పాపారావు జనసేన పార్టీ సిద్ధాంతాలు, అధినేత పవన్ కళ్యాణ్ భావజాలం తనకి స్ఫూర్తిని కలిగించాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పైడి మురళి మోహన్, మురపాక రాజశేఖర్ పాల్గొన్నారు.