సూర్యారావు పేట గ్రామంలో జనం కోసం పవన్ -పవన్ కోసం మనం

కాకినాడ రూరల్ నియోజకవర్గం: రూరల్ మండలం, సూర్యారావు పేట గ్రామం లైట్ హౌస్ ప్రాంతంలో జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఉమ్మడి కార్యాచరణలో భాగంగా సూర్యారావు పేట లైట్ హౌస్ ప్రాంత జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉన్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, మరియు తెలుగుదేశం నాయకులు సీతయ్యాదొర, ఎజ్జల బాబ్జి. ఈ ప్రాంతంలోని ప్రజలు పంతం నానాజీకి వారి సమస్యలను తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ బాగోలేదని పంచాయతీ సిబ్బంది కాలువలు శుభ్రం చేయడం లేదని, మంచినీటి సమస్య అధికంగా ఉందని, త్రాగునిటీ కోసం ప్రభుత్వం నిర్వహించే వాటర్ ప్లాంట్ వినియోగం లేదని, ఏ డి బి రోడ్ నుండీ పోర్ట్ కి వెళ్లే భారీ వాహనాల వల్ల రోడ్లు పాడయి పోయి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని ప్రతీ సంవత్సరం ధర్నాలు చేస్తే గానీ జీతాలు పెరగడం లేదని, మత్స్య కారులకి వేట సామాగ్రికి, పనులు చేసుకోవడానికి భవనం నిర్మించాలని, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి కాళీ చేయించి పట్టాలు ఇవ్వకుండా రోడ్డున పడ వేశారని, పరిశ్రమ వ్యర్థలవల్ల అనేక ఆరోగ్య సమస్యలు, అర్హులకు పట్టాలు, పింఛన్లు ఇవ్వలేదని ఇలా అనేక సమస్యలు తెలిపారు. త్వరలోనే జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం రాబోతోందని మీ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు సింహాద్రి, శోభనబాబు, ఎల్లబోయిన రామకృష్ణ, గరికిన సురేష్, సోదే ముసలయ్య, మల్లె భాస్కర్, సురడా శ్రీను, తదితరులు, జనసేన యువత మరియు తెలుగుదేశం నాయకులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.