పవన్ కౌలు రైతులకు దత్తపుత్రుడు: ముత్తా శశిధర్

  • రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీకి జనసేనానిని ఆహ్వానిస్తున్నారు
  • 33 లక్షల ఇళ్లల్లో కాకినాడ స్థానం ఎక్కడ?

కాకినాడ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, వీటిని జన సైనికులుగా తీవ్రంగా ఖండిస్తున్నామని పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్, కాకినాడ నగర అధ్యక్షుడు తోట సుధీర్ అన్నారు. గురువారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శశిధర్, సుధీర్లు మాట్లాడుతూ సీఎం జగన్ జగన్ పేర్కొన్నట్లు సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు, 31 లక్షలు కౌలు రైతులకు సొంత నగదును అందించిన పవన్ కళ్యాణ్ వారికి దత్తపుత్రుడేనని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చి రాజకీయ విమర్శలు చేయడం తగదన్నారు. జగన్ కు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఇళ్ళు లేవా అని ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. కుటుంబం, వ్యక్తులు పట్ల తమకు గౌరవం ఉందని, రాజకీయ విమర్శల్లో కుటుంబ సభ్యుల ప్రస్తావన తీసుకురావడం చేతకాని తనమేనన్నారు. కుల రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం – జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు.175 సీట్లలో తెలుగుదేశం జనసేన పోటీ చేస్తుందన్నారు. ఎక్కడైనా పోటీ చేసే సత్తా జనసేన సొంతమన్నారు. పవన్ కళ్యాణ్ ను గాజువాక భీమవరం ప్రాంతాలే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు ఆయా తోటల నుండి పోటీ చేయాలని కోరుతున్నారని చెప్పారు. సామర్లకోటకు సంబంధించి నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో కాకినాడలో నిర్మించిన ఇళ్లకు మీడియాలో ఫోటోలు ఎందుకు ప్రచురించలేదో కాకినాడ సిటి ఎమ్మెల్యే బహిర్గతం చేయాలని శశిధర్, సుధీర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఖజానా సొమ్మును బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే నగదు జమ చేస్తున్నానని చెబుతున్న సీఎం జగన్ మద్యం, ఇసుక నుండి వస్తున్న అక్రమ నగదును కూడా అతను సొంత ఖాతాకే జమవుతుందని సుధీర్, ముత్తాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రెటరీ వాసిరెడ్డి శివ జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ జనసేన నాయకులు అడబాల సత్యనారాయణ, లోవరాజు, దాసరి వీరబాబు వలి బాషా మావులూరి సురేష్, చీకట్ల శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, అగ్రహారపు సతీష్ సమీర్ తదితరులు.