పవన్ కళ్యాణ్, వారాహి వాహనం పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించిన అనుశ్రీ

రాజమండ్రి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజాయాత్రలో భాగంగా నూతన వారాహి వాహనం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక రాజమండ్రి గోదావరి గట్టు వద్ద నున్న పెద్ద ఆంజనేయస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరు మీద, వారాహి వాహనం పేరు మీద వేద పండితులతో రాజమండ్రి అర్బన్ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీలు వైవీడి ప్రసాద్ గెడ్డం నాగరాజు ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ సిటీ కార్యదర్శి అల్లాటి రాజు, గుణ్ణం శ్యాంసుందర్, విన్న వాసు, జనసేన యువ నాయకులు బయ్యపునీడి సూర్య, జన సైనికులు విక్టరీ వాసు, మంచాల సునీల్, ఏడి ప్రసాద్, కుప్పిలి రాఘవ, మట్టపర్తి నాగరాజు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.