రాష్ట్ర క్షేమం కోసం నిస్వార్థంగా పని చేసే నాయకుడు పవన్ కళ్యాణ్

పార్వతీపురం నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు చందక అనీల్, నెయ్యిగాపుల సురేష్, సిరిపురపు గౌరీ మరియు రేవల దుర్గా తదితరులు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పడాల అరుణని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కలయికలో నియోజకవర్గంలో అనేక అంశాలపై చర్చించారు. వాటిని ముఖ్యంగా కొన్ని అంశాలు వివరించి చెప్పారు అవి ఏమిటి అంటే రాష్ట్ర క్షేమం కోసం నిస్వార్థంగా పని చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ కావున వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జనసైనికులు సిద్దమవ్వాలి తెలిపారు. అలాగే పొత్తులో భాగంగా రెండు పార్టీల్లోనూ కొన్ని త్యాగాలు తప్పవు కావున ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు పక్కన పెట్టండి అని ముఖ్యంగా వైసీపీ నాయకులు కావాలనే గొడవలు సృష్టిస్తారు జాగ్రత్తగా ఉండండి అని ప్రస్థుత రాజకీయాలు వివరించారు. అనంతరం పడాల అరుణ రాజకీయ అనుభవాలు జనసైనికులకి నాయకులతో పంచుకున్నారు.