ఆంధ్రప్రదేశ్ ప్రాణవాయువు పవన్ కళ్యాణ్

  • జీడి నెల్లూరు విషవాయువు నారాయణస్వామి
  • ఏ వర్గానికి మేలుచేయని ఉప ముఖ్యమంత్రి
  • కనీసం తయ్యూరు చిన్నబ్బకైనా 10 లక్షలు సహాయం చేసి పుణ్యం కట్టుకో
  • వచ్చే జనసేన ప్రభుత్వంలో ఆదాయానికి మించిన నీ ఆస్తులపై సిబిఐ ఎంక్వయిరీ వేయిస్తా
  • జనసేన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: ఎస్ ఆర్ పురం మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరించి నిరసన తెలియజేసినందుకు ప్రతిస్పందనగా పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ పున్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లనుద్దేశించి పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరించి, ప్రభుత్వ వైఫల్యాలను కపిపుచ్చుకోవడానికి, అంగన్వాడీ సమస్యల నుండి ప్రజలు చూపును మరల్చడానికి ఎత్తుగడ వేశారు. 21వ శతాబ్దపు ఆస్తి ఈ రాష్ట్రానికి యువత, అలాంటి యువశక్తిని ఐదువేల రూపాయలకి తాకట్టు పెట్టిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. సరైనటువంటి ఉపాధి కల్పించి స్వశక్తి పైకి వచ్చే విధంగా ఆదాయ మార్గాన్ని పెంచి, వారిలో ఉన్న నైపుణ్యాన్ని బట్టి వారికి అవకాశాలు కల్పించాలి గాని, ఊడిగం చేసే విధంగా ఉండకూడదని, వారి మేధాశక్తిని రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చేయాలి తప్ప ఈ రకంగా వారికి అన్యాయం చేయడం భావ్యం కాదని పవన్ కళ్యాణ్ ఉద్దేశమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ప్రాణవాయువు, అదే జీడి నెల్లూరు నియోజకవర్గానికి నారాయణస్వామి విషవాయువు అని ఉద్ఘటించారు. ఉప ముఖ్యమంత్రి వల్ల ఏ వర్గము బాగుపడలేదని, కనీసం ఇంటికి వెళ్లే ముందు అయినా నిరుపేద అయిన తయ్యూరు చిన్నబ్బకి పది లక్షల రూపాయలు సహాయం చేసి ఆదుకోవాలని స్వామికి సలహా ఇస్తున్నానని చెప్పారు. వచ్చే జనసేన ప్రభుత్వంలో ఆదాయానికి మించిన ఆస్తులపై సిబిఐ ఎంక్వయిరీ వేయిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. నారాయణస్వామి ఇదే చివరి ఎన్నికలని, మూట ముళ్ళు సర్దుకుని, ఇంటికి పరిమితమై, ఎలా కాలక్షేపం చేయాలో ఇప్పుడు ఒక ప్రణాళిక వేసుకోవడం మంచిదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, మండల ఉపాధ్యక్షులు చార్లెస్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షులు బుల్లెట్ శీను, నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చంద్రమౌళి, ఎస్ఆర్ పురం మండల కార్యదర్శి గిరి ప్రసాద్, కార్వేటి నగర్ టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, కార్వేటి నగరం మండల ప్రధాన కార్యదర్శి నరేష్, కార్వేటినగరం టౌన్ కార్యదర్శి మణి, వెదురుకుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం, వెదురుకుప్పం మండల బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, ఎస్ఆర్ పురం మండల జనసైనికులు, అజయ్, మున్నా పాల్గొన్నారు.