అంబేడ్కర్ కలలు కన్న సమసమాజ స్థాపనే లక్ష్యంగా శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్: మార్కండేయ బాబు

  • అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించిన గుంటూరు జనసేన

గుంటూరు: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత రాజ్యాంగ నిర్మాత, భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్‌ బి.ఆర్ అంబేడ్కర్ ఆశయసాధనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సదా నిబద్ధుడై ఉన్నాడని, అంబేడ్కర్ కలలు కన్న సమసమాజ స్థాపనకై పవన్ కళ్యాణ్ నిరంతరం శ్రమిస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు అన్నారు. అంబేడ్కర్ 66వ వర్ధంతి సందర్భంగా నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని బొంగరాల బీడు, రాజీవ్ గాంధీ నగర్, చాకలి గుంట, యల్ ఆర్ కాలనీ, నల్ల చెరువు, కార్మికుల కాలనీలోని అంభేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మార్కండేయ బాబు మాట్లాడుతూ నిమ్న కులాల్లో పుట్టినవారు పడ్డ అవమానాలు, వేధింపులను, కష్టాలను అనుభవించిన అంబేడ్కర్ తన జీవితపర్యంతం అణగారిన వర్గాల అభ్యున్నతికై పోరాడారని కొనియాడారు. అట్టడుగు వర్గాల వారిని అత్యున్నతస్థాయికి తీసుకువచ్చేందుకు అంబేడ్కర్ వేసిన బాట భారతదేశ చరిత్రలో మరొకరు వేయలేదన్నారు. అభివృద్ధి ఫలాలు, రాజ్యాధికారం అన్ని కులాలకు అందాలన్న అంబేడ్కర్ కలలు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నిజం కానున్నాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి తన మేధా సంపత్తితో రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ కి ప్రతీ భారతీయుడు ఋణపడి ఉంటారని మార్కండేయ బాబు అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ అంబేడ్కర్ లాంటి కారణజన్ములు మనదేశంలో జన్మించటం భారతీయుల అదృష్టమన్నారు. దేశభక్తి, సమాజం పట్ల బాధ్యత, కుల రహిత సమాజ స్థాపన, అంటరానితన నిర్మూలన లాంటి భావనలు ఉన్న ప్రతీఒక్కరూ అంబేడ్కర్ జీవిత చరిత్రను చదవాలని కోరారు. అంబేడ్కర్ ఆశయాలే ఆలంబనగా జనసేన ముందుకు సాగుతోందని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక సంఘ నాయకులు సోమి శంకరరావు, సీనియర్ నాయకురాలు రాజనాల నాగలక్ష్మి, నగర అర్బన్ పార్టీ ఉపాధ్యక్షుడు చింతా రేణుకా రాజు, ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి ఉదయ్, ఆనంద్ సాగర్, కార్యదర్సులు బందెల నవీన్ కుమార్, సోమి ఉదయ్, మెహబూబ్ బాషా, త్రిపుర, తిరుమలశెట్టి నరేష్, వీరమహిళలు మల్లేశ్వరి, బొమ్మిరెడ్డి కవిత, గిడుతూరి సత్యం, కొత్తకోట ప్రసాద్, ఫణి శర్మ, నాగేంద్ర సింగ్జ్, దుర్గ ప్రసాద్, పులిగడ్డ గోపి, కొనిదేటి కిషోర్, డివిజన్ అధ్యక్షులు పులిగడ్డ నాగేశ్వరరావు, ఏడుకొండలు, సయ్యద్ షర్ఫుద్దీన్, రాజేష్, సుబ్బారావు వడ్డె, ఇల్లా శేషు తదితరులు పాల్గొన్నారు.